dcsimg

పంది ( Telugo )

fornecido por wikipedia emerging languages

 src=
love between animals

పంది లేదా వరాహము (ఆంగ్లం: Pigs) సూయిడే కుటుంబానికి చెందిన ఒక పెంపుడు జంతువు. ఇవి క్షీరదాలు, ఖురిత జంతువులు

ఇవి ప్రాచీన కాలం నుండి ఆహారం, తోలు, ఇతర వస్తువుల కోసం మానవులు పెంచుకుంటున్నారు. దీని వలన ఇవి వివిధ కళలు, సామెతలలో పంది ప్రాచుర్యంలో ఉన్నాయి. ఆధునిక కాలంలో వీటిని శాస్త్రీయ పరిశోధన, వైద్య చికిత్సలలో వీని కళ్ళు, గుండె మానవులకు దగ్గర పోలికల మూలంగా ఉపయోగిస్తున్నారు. ఈకాలంలో కూడా కొంతమంది పందుల పెంపకం చేస్తున్నారు. ప్రస్తుతం సుమారు 2 బిలియన్ పందులు భూమి మీద ఉన్నాయని అంచనా.[1][2]

యూరేసియాకు చెందిన పందులు సుస్ ప్రజాతికి చెందినవి. ఇవి పెద్ద శబ్దం చేస్తూ తినేదానికి బురదతో మురికి పట్టి అసహ్యంగా ఉన్నా చాలా తెలివైన జంతువులుగా ప్రసిద్ధిచెందినవి.

భాషా విశేషాలు

 src=
పందుల పెంపకం
 src=
పంది పిల్లల గుంపు

తెలుగు భాషలో పంది పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] పంది n. A hog. ఊరపంది the domesticated pig. అడవిపంది the wild hog. a boar. ఏదుపంది or ముండ్లపంది a porcupine. నీరుపంది a porpoise. పందికొక్కు [Lit. The pig-rat. The Eng. n. 'en:Bandicoot, ' is a corruption of this word.] n. A Bandicoot. The Bandicoot-Rat. Nesocia bandi-cota. (F.B.I.) సీమ పందికొక్కు a guinea pig. వడ్లగాదెలో పందికొక్కును పెట్టినట్టు అనేది సామెత, i.e., setting a bandicoot in a granary. cf. Setting the wolf to take care of the sheep. పందిగడ్డ n. The name of a certain edible root. The pignut. శృంగాటకము, పరికెదుంప. పందిగోరు n. A boar's tusk or claw. A weapon used by boar hunters, వేటకాని సాధన విశేషము. పందిజిట్ట or పందిపిట్ట n. The small White throated Babbler, Dumetia albigularis. పందిపోటు or పందీటే n. A spear used to hunt boars with. పందిముక్కు, పందిమూతి or పందిపీట n. A kind of step used in old fashioned carts. గాడీ మొదలైన ఎక్కుడు బండ్ల చివరను పందిమూతి వలె నమర్చిన ఒక విధమైన ఉపకరణము.

పందులలో రకాలు

పురాణాలలో

మూలాలు

  1. Production, Supply and Distribution Online Query, United States Department of Agriculture, Foreign Agricultural Service
  2. Swine Summary Selected Countries Archived 2012-03-29 at the Wayback Machine., United States Department of Agriculture, Foreign Agricultural Service, (total number is Production (Pig Crop) plus Total Beginning Stocks
  3. "బ్రౌన్ నిఘంటువు ప్రకారం పంది పదప్రయోగాలు". మూలం నుండి 2016-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-01-20. Cite web requires |website= (help)
  4. Zoological Journal of the Linnean Society (1997), 120: 163–191.
licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages