dcsimg

వాలిడి ( Telugu )

provided by wikipedia emerging languages

Script error: No such module "Pp-move-indef".

వాలిడి (హోమినోయిడియా) పాత ప్రపంచంలో ఆఫ్రికా, ఆగ్నేయాసియాలకు చెందిన తోకలేని సిమియన్. దీన్ని తోక లేని కోతి అని కూడా ఆంటారు. ఇవి పాత ప్రపంచపు కోతుల సోదర సమూహాలు. ఈ రెండూ కలిసి కెటరైన్ క్లాడ్‌ లో భాగం. ఇతర ప్రైమేట్ల కంటే భిన్నంగా వీటికి భుజం కీళ్ళ వద్ద చలనాలు ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయిక, సైన్సేతర ఉపయోగంలో, "వాలిడి", "తోక లేని కోతి" అనే పదానికి అర్థంలో మానవులు రారు. ఆ విధంగా, ఇది హోమినోయిడియా శాస్త్రీయ టాక్సన్ తో సమానం కాదు. హోమినోయిడియా సూపర్ ఫ్యామిలీలో రెండు శాఖలు ఉన్నాయి: గిబ్బన్లు లేదా చిన్న కోతులు; హోమినిడ్లు లేదా గొప్ప కోతులు .

  • చిన్న కోతుల కుటుంబమైన హిలోబాటిడేలో నాలుగు ప్రజాఆతులు, మొత్తం పదహారు జాతుల గిబ్బన్లు ఉన్నాయి. ఇవన్నీ ఆసియాకు చెందినవి. అవి ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. నేలపై ఉన్నపుడు రెండు కాళ్ళపై నడుస్తాయి. వీటికి గొప్ప కోతుల కంటే తేలికైన శరీరాలుంటాయి. చిన్న సమూహాల్లో నివసిస్తాయి.
  • గొప్ప కోతుల కుటుంబమైన హోమినిడే (హోమినిడ్స్) లో మూడు ప్రజాతులు (జీనస్‌లు) ఉన్నాయి. వీటిలో మూడు జాతుల ఒరంగుటాన్లు వాటి ఉపజాతులూ, రెండు జాతుల గొరిల్లాలు వాటి ఉపజాతులూ, రెండు జాతుల చింపాంజీలు వాటి ఉపజాతులూ, ఒక జాతి మానవులు అందులో ఒకే ఒక్క ఉపజాతి - ఇవన్నీ ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి. [1] [lower-alpha 1] [2] [3]

మూలాలు

  1. Dixson, A.F. (1981). The Natural History of the Gorilla. London: Weidenfeld & Nicolson. ISBN 978-0-297-77895-0., p. 13
  2. Grehan, J.R. (2006). "Mona Lisa Smile: The morphological enigma of human and great ape evolution". Anatomical Record. 289B (4): 139–157. doi:10.1002/ar.b.20107. PMID 16865704.
  3. Benton, Michael J. (2005). Vertebrate palaeontology. Wiley-Blackwell. ISBN 978-0-632-05637-8. Retrieved 10 జులై 2011., p. 371
  1. Although Dawkins is clear that he uses "apes" for Hominoidea, he also uses "great apes" in ways which exclude humans. Thus in Dawkins, R. (2005). The Ancestor's Tale (p/b సంపాదకులు.). London: Phoenix (Orion Books). ISBN 978-0-7538-1996-8.: "Long before people thought in terms of evolution ... great apes were often confused with humans" (p. 114); "gibbons are faithfully monogamous, unlike the great apes which are our closer relatives" (p. 126).
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

వాలిడి: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

Script error: No such module "Pp-move-indef".

వాలిడి (హోమినోయిడియా) పాత ప్రపంచంలో ఆఫ్రికా, ఆగ్నేయాసియాలకు చెందిన తోకలేని సిమియన్. దీన్ని తోక లేని కోతి అని కూడా ఆంటారు. ఇవి పాత ప్రపంచపు కోతుల సోదర సమూహాలు. ఈ రెండూ కలిసి కెటరైన్ క్లాడ్‌ లో భాగం. ఇతర ప్రైమేట్ల కంటే భిన్నంగా వీటికి భుజం కీళ్ళ వద్ద చలనాలు ఎక్కువగా ఉంటాయి. సాంప్రదాయిక, సైన్సేతర ఉపయోగంలో, "వాలిడి", "తోక లేని కోతి" అనే పదానికి అర్థంలో మానవులు రారు. ఆ విధంగా, ఇది హోమినోయిడియా శాస్త్రీయ టాక్సన్ తో సమానం కాదు. హోమినోయిడియా సూపర్ ఫ్యామిలీలో రెండు శాఖలు ఉన్నాయి: గిబ్బన్లు లేదా చిన్న కోతులు; హోమినిడ్లు లేదా గొప్ప కోతులు .

చిన్న కోతుల కుటుంబమైన హిలోబాటిడేలో నాలుగు ప్రజాఆతులు, మొత్తం పదహారు జాతుల గిబ్బన్లు ఉన్నాయి. ఇవన్నీ ఆసియాకు చెందినవి. అవి ఎక్కువగా చెట్లపై నివసిస్తాయి. నేలపై ఉన్నపుడు రెండు కాళ్ళపై నడుస్తాయి. వీటికి గొప్ప కోతుల కంటే తేలికైన శరీరాలుంటాయి. చిన్న సమూహాల్లో నివసిస్తాయి. గొప్ప కోతుల కుటుంబమైన హోమినిడే (హోమినిడ్స్) లో మూడు ప్రజాతులు (జీనస్‌లు) ఉన్నాయి. వీటిలో మూడు జాతుల ఒరంగుటాన్లు వాటి ఉపజాతులూ, రెండు జాతుల గొరిల్లాలు వాటి ఉపజాతులూ, రెండు జాతుల చింపాంజీలు వాటి ఉపజాతులూ, ఒక జాతి మానవులు అందులో ఒకే ఒక్క ఉపజాతి - ఇవన్నీ ప్రస్తుతం ఉనికిలో ఉన్నాయి.
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు