dcsimg

మాచిపత్రి ( Telugo )

fornecido por wikipedia emerging languages

మాచిపత్రి ఒక రకమైన మందుమొక్క. దీని శాస్త్రీయనామం ఆర్టిమీసియా వల్గారిస్ (Artemesia vulgaris). ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది.మాచీ పత్రి మాఛిపత్రి చెందినది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధి వినాయక ఏకవింశతి పత్రపూజ క్రమములో ఈ ఆకు ఒకట వది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం Artemisia.vulgaris.

లక్షణాలు

  • ఈ ఆకు లేత పచ్చ రంగులో ఉంటుంది. ఆకారం సూదికొనలతో ఉంటుంది. పరిమాణం మధ్యస్థం. ఈ చెట్టు చిన్న మొక్క గా పెరుగుతుంది.
  • సువాసన వెదజల్లే బహువార్షిక గుల్మం.
  • అనేక తమ్మెలుగా చీలిన వివిధ ఆకారాలు గల సరళ పత్రాలు.
  • భిన్నపుష్టి శీర్షవద్విన్యాసంలో అమరి ఉన్న తెలుపు రంగు పుష్పాలు. ఊలు వంటి నూగున్న రక్షకపత్రాలు.

వైద్య గుణాలు

ఈ పత్రి యొక్క ఔశధ గుణాలు :

  1. ఈ ఆకుని పసుపు, నువ్వుల నూనెతో కలిపి నూరి ఆ ముద్దను చర్మ వ్యాధులు ఉన్న చోట రాస్తే త్వరగా వ్యాధి నివారణ అవుతుంది.
  2. వాత రోగాలు
  3. ఇది నేత్ర సంబంధ రోగాలకు అద్భుత నివారిణి. మాచీ పత్రాన్ని నీళ్లలో తడిపి కళ్లకి కట్టుకుంటే నేత్రవ్యాధులు నయమవుతాయి.

సువాసన గుణం

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఇతర ఉపయోగాలు

ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు :

  • 1. వ్రణాలు, క్రిమిహారి, దద్దుర్లు, వాత రోగాలు, నులిపురుగులను తగ్గిస్తుంది.
  • 2.అతి దాహాన్ని హరిస్తుంది.
  • 3. కొన్ని రకాల జ్వరాలను కూడా ఇది తగ్గించగలదు.

ఆయుర్వేదంలో

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది నేత్రవ్యాధులు , రకాల జ్వరాలను,వాత రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

వనరులు

మూలాలు

ఇతర లింకులు

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages