dcsimg

డిప్టెరోకార్పేసి ( Telugo )

fornecido por wikipedia emerging languages

డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం.

వీనిలోని సుమారు 17 ప్రజాతులలో 500 పైగా జాతుల వృక్షాలున్నాయి. దీనికి పేరు డిప్టెరోకార్పస్ (Dipterocarpus) నుండి వచ్చింది. గ్రీకు భాష ప్రకారం (డై = రెండు, టెరాన్ = రెక్కలు, కార్పోస్ = పండు) అని అర్ధం అనగా వీనికి రెండు రెక్కలు కలిగిన పండు ఉంటుంది. వీనిలోని అతి పెద్ద ప్రజాతులు అయిన షోరియా (Shorea) (196 species), హోపియా (Hopea)లో (104 species), డిప్టెరోకార్పస్ (Dipterocarpus)లో (70 species), వాటికా (Vatica)లో (65 species) ఉన్నాయి.[1] వీనిలో అధికశాతం పెద్ద వృక్షాలుగా సుమారు 40-70 మీటర్లు పెరుగుతాయి. ఈ చెట్లు కలప కోసం ప్రసిద్ధిచెందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

గుగ్గిలపు కుటుంబం

గుగ్గిలపు చెట్లు మన దేశములో విరివిగానె పెరుగు చున్నవి.

ఆకులు

లఘు పత్రములు. ఒంటరి చేరిక. అండాకారముగ నైన నిడివి చౌక పునాకారముగనైన యుండును. సమాంచలము. విషమ రేఖ పత్రము. కొన, వాల గలలదు.

పుష్పమంజరి

కొమ్మల చివరల నుండి గాని, కణుపు సందుల నుండి గాని మధ్యారంభ మంజరులగు రెమ్మ గెలలు, పుష్పములు ఉప వృంతములు మిక్కిలి పొట్టివి, పువ్వులు లేత పశుపు రంగు.

పుష్పకోశము

సంయుక్తము. గొట్టము పొట్టి. తమ్మెలు సన్నము. మొగ్గలో అల్లుకొని యుండును.

దళవలయము

అసంయుక్తము. 5. కొంచెము బల్లెపునాకారముగ నుండును. మంచి వాసనయే గలదు. వృంతాశ్రితము.

కింజల్కములు

ఏబది గలవు. పుప్పొడి తిత్తులు రెండు గదులు. కింజల్కములు వృంతాశ్రితములు.

అండకోశము

అండాశయము ఉచ్చము 3 గదులు గలవు. ఒక్కొక్క దాని యందు రెండేసి యండము లున్నవి. కీలము పొట్టి. కీలాగ్రములు మూడు చీలికలు, కాయ ఎండి పగులును.

ఈకుటుంబములోని చెట్ట్లన్నియు పెద్ద వృక్షములే. వీని నన్నిటినుండు గుగ్గిలము వంటి పదార్థము వచ్చును. ఆకులు ఒంటరి చేరిక లఘుపత్రములు. వీనికి చిన్నచిన్నకణుపు పుచ్చములున్నవి. పువ్వులకు మంచి వాసన గలదు. ఆకర్షణ పత్రములు సాధారణముగ మొక్కలో మెలిపెట్టి నట్లుండును. కీరాగ్రములు మూడు.

గుగ్గిలము

చెట్లు హిమాలయ పర్వతాల ప్రాంతములను, రాజాహాలు కొండల వద్దను, ఒడిషా, మధ్యపరగణాలు, అంధ్ర దేశములోను ఎక్కువగా బెరుగు చున్నవి. ముదురు చెట్లను మూడు నాలుగుగడుగులెత్తున చెట్టు పరిమాణమును బట్టి నాలుగైదు చోట్ల {బెరడు} గీసెదరు. ఆ చారలలోనికి అరపూస వంటి పదార్థము వచ్చి చేరును. అధి మొట్టమొదట తెల్లగానే యుండును గాని తరువాత కొంచెము గోధుమ వర్ణము వచ్చును. ఇదియే గుగ్గిలము. దీనిని తీసి వేసిన తరువాత కొన్ని నెలలకు ఆచారలోనే మరికొంత చేరును. ఇట్లు మూడు మాట్లు తీయ వచ్చును గాని మాటి మాటికి తక్కువ రకము వచ్చు చుండును. గుగ్గిలము నౌషధములలో వాడుదురు. దీనిని లోపలి కివ్వరు గాని కొన్ని మందులతో గలిపి పైన రాయుచుందురు. దురువాసన బోగొట్టుటకు దీనిని పొగవేయుదురు. పడవలు, ఓడలు కట్టుటలో దీనినుపయోగింతురు. దీని బెరడు తోలు బాగు చేయుటకు కూద బనికి వచ్చును.

తెల్లడామర

చెట్టు పెద్దదియె. దీని యాకులు నగోళాకారము. దీని నుండియు గుగ్గిలము వంటిది వచ్చును. దీనిని గూడ గుగ్గిలము వలె నౌషధములలో వాడుదురు. దీని కర్పూర తైలములో ల్గలిపిన మంచి వార్నీషు అగును. దీనినే కొబ్బరి నూనెలో గలిపి క్రొవ్వు వత్తులు కూడ చేయవచ్చును. తెల్లడామర గింజలనుండి వచ్చు చమురుకూడ క్రొవ్వు వత్తులు చేయుటకు బనికి వచ్చును. ఈ చమురు నొక కప్పుడు నేతిలో కలిపి దగా చేయుచుందురు. దీని బెరడు వగరుగా నుండును. కల్లు పులియకుండ కొన్ని చోట్ల దీనిని వేయు చుందురు. కలప గుగ్గిలపు చెట్టు కలపంత మంచిది కాదు.

నల్లడామర

ఆకులు కొంచెము హృదయాకారముగ నుండును. దీని నుండియు గుగ్గిలము వచ్చును. ఈ చెట్టు నుండి మంచి కలపయు వచ్చును.

మూలాలు

  1. Ashton, P.S. Dipterocarpaceae. In Tree Flora of Sabah and Sarawak, Volume 5, 2004. Soepadmo, E., Saw, L. G. and Chung, R. C. K. eds. Government of Malaysia, Kuala Lumpur, Malaysia. ISBN 983-2181-59-3
licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages

డిప్టెరోకార్పేసి: Brief Summary ( Telugo )

fornecido por wikipedia emerging languages

డిప్టెరోకార్పేసి (Dipterocarpaceae) పుష్పించే మొక్కలలోని ఒక కుటుంబం.

వీనిలోని సుమారు 17 ప్రజాతులలో 500 పైగా జాతుల వృక్షాలున్నాయి. దీనికి పేరు డిప్టెరోకార్పస్ (Dipterocarpus) నుండి వచ్చింది. గ్రీకు భాష ప్రకారం (డై = రెండు, టెరాన్ = రెక్కలు, కార్పోస్ = పండు) అని అర్ధం అనగా వీనికి రెండు రెక్కలు కలిగిన పండు ఉంటుంది. వీనిలోని అతి పెద్ద ప్రజాతులు అయిన షోరియా (Shorea) (196 species), హోపియా (Hopea)లో (104 species), డిప్టెరోకార్పస్ (Dipterocarpus)లో (70 species), వాటికా (Vatica)లో (65 species) ఉన్నాయి. వీనిలో అధికశాతం పెద్ద వృక్షాలుగా సుమారు 40-70 మీటర్లు పెరుగుతాయి. ఈ చెట్లు కలప కోసం ప్రసిద్ధిచెందాయి. ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి.

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages