dcsimg

సహస్రపాదులు ( Telugu )

provided by wikipedia emerging languages

సహస్రపాదులు (ఆంగ్లం Millipede) ఆర్థ్రోపోడా వర్గానికి చెందిన జంతువులు. ఇవి డిప్లోపోడా తరగతికి చెందినవి. వీటిని రోకలిబండ అని కూడా పిలుస్తారు. ఈ తరగతిలో సుమారు 13 క్రమాలు, 115 కుటుంబాలు, 10,000 జాతుల జీవులున్నాయి. వీటన్నింటిలోకీ ఆఫ్రికన్ సహస్రపాదులు (Archispirostreptus gigas) పెద్దదైన జాతి. ఇవి కుళ్ళిన పదార్ధాలను ఆహారంగా తీసుకొనే డెట్రిటివోర్లు (detritivore).

సహస్రపాదుల్ని శతపాదుల్నించి (కీలోపోడా) సులువుగా గుర్తించవచ్చును. శతపాదులు చాలా వేగంగా కదలుతాయి, వాటిలో ప్రతి ఖండితానికి ఒక జత కాళ్ళు మాత్రమే ఉంటాయి.

సామాన్య లక్షణాలు

  • చాలా సహస్రపాదులు పొడవుగా రోకలి లాగా స్తంభాకారంలో ఉంటాయి.
  • వీటి దేహం తల, మొండెంగా విభజన చెందింది.
  • తలలో స్పర్శశృంగాలు, హనువులు, జంభికలు ఒక్కొక్క జత చొప్పున ఉంటాయి.
  • మొండెంలోని మొదటి ఖండిత ఉదరఫలకంతో జంభికలు విలీనం చెందడంతో నేతోకిలేరియం అనే నమిలే పరికరం ఏర్పడుతుంది.
  • సహస్రపాదులకు ప్రతీ ఖండితానికి రెండు జతల కాళ్ళు , శ్వాసరంధ్రాలు ఉంటాయి. (మొదటి ఖండితానికి కాళ్లుండవు; తరువాత కొన్ని ఖండితాలకు ఒకటే జత కాళ్ళుంటాయి) దీనికి కారణం రెండు ఖండితాలు కలసి ఒకటిగా మారడమే.
  • మాల్పిజియన్ నాళికలు విసర్జితాంగాలుగా పనిచేస్తాయి.
  • జనన రంధ్రం మొండెం పూర్వభాగాన ఉంటుంది.

మూలాలు

  1. "Diplopoda DeBlainville in Gervais, 1844 (Class)". SysTax. Universität Ulm, Ruhr-Universität Bochum. మూలం నుండి 2007-08-18 న ఆర్కైవు చేసారు. Retrieved 2007-08-15.

గ్యాలరీ

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు