dcsimg
Image of Indian nard
Creatures » » Plants » » Dicotyledons » » Honeysuckle Family »

Indian Nard

Nardostachys jatamansi (D. Don) DC.

జటామాంసి ( Telugu )

provided by wikipedia emerging languages

జటామాంసి (Spikenard) ఒక రకమైన ఔషధ మొక్క.[1]

ప్రాంతీయ నామాలు

  • ఆంగ్లం : Muskroot
  • బెంగాలీ : జటామాన్సి
  • గుజరాతీ : కాలిచాద్, జటామాసి
  • హిందీ : బల్-చీర్, జటామాసి
  • కన్నడం : బల్-చీర్, జటామాసి
  • మలయాళం : బల్-చీర్, జటామాసి
  • ఒరియా : జటామాన్సి
  • తమిళం : జటామాన్షీ

లక్షణాలు

  • ఇది నిటారుగా పెరిగే బహువార్షిక గుల్మం, 10-60 సెం.మీ. ఎత్తు పెరుగుతుంది. కాండం దృఢంగా ఉంటుంది.
  • పత్రాల కాడలు ఎర్రని-గోధుమ వర్ణపు నూగు కలిగివుంటాయి. పత్రాలు నలువైపులకు విస్తరించి సమాంతర ఈనెలతో ఉంటాయి.
  • పుష్పాలు లేత గులాబీ రంగులో లేదా నీలి రంగులో ఉంటాయి.

ఉపయోగాలు

  • గుంప చేదు, తీపి, వగరు కలగలిసి ఉంటుంది. ఇది చలువచేసే గుణాన్ని కలిగివుంటుంది.
  • దీనిని దగ్గు, ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలు, భుజపుటెముక నొప్పి, తలనొప్పి, అజీర్తి, శూల, కడుపు ఉబ్బరం, కాలేయ, మూత్ర సంబంధ వ్యాధులకు, బహిష్టు నొప్పి, రక్తపోటు, తలనెరియడం, జుట్టురాలిపోవడం వంటి వాటి చికిత్సకు ఉపయోగిస్తారు.

మూలాలు

  1. "బ్రౌన్ నిఘంటువులో జటామాంసి గురించిన వివరాలు". మూలం నుండి 2016-01-25 న ఆర్కైవు చేసారు. Retrieved 2010-12-28. Cite web requires |website= (help)
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు