dcsimg

మందార ( Telugo )

fornecido por wikipedia emerging languages

మందార లేదా మందారం ఒక అందమైన పువ్వుల చెట్టు. ఇదిమాల్వేసి కుటుంబానికి చెందినది. ఇది తూర్పు ఆసియాకు చెందినది. దీనిని చైనీస్ హైబిస్కస్ లేదా చైనా రోస్ అని కూడా అంటారు. దీనిని ఉష్ణ, సమసీతోష్ణ ప్రాంతాలలో అలంకరణ కోసం పెంచుతారు. పువ్వులు పెద్దవిగా ఎరుపు రంగులో సువాసన లేకుండా ఆకర్షణీయంగా ఉంటాయి. వీనిలో చాలా రకాల జాతులు ఉన్నాయి. తెలుపు, పసుపు, కాషాయ, మొదలైన వివిధ రంగులలో పూలు ఉంటాయి. ముద్ద మందారం అనే వాటికి రెండు వరుసలలో ఆకర్షక పత్రావళి ఉంటాయి. అందమైన పుష్పాలున్నా ఇవి మకరందాన్ని గ్రోలే కీటకాలు, పక్షుల్ని ఆకర్షించవు. [1][2][3]

 src=
ముద్దమందారం

లక్షణాలు

  • నక్షత్రాకార కేశాలతో పెరిగే సతత హరితమైన పొద.
  • అండాకారంలో ఉన్న సరళ పత్రాలు.
  • పత్రగ్రీవాలలో ఏకాంతంగా ఏర్పడిన ఎరుపు రంగు పుష్పాలు.
  • దీర్ఘవృత్తాకార ఫలం.

జాతీయ చిహ్నాలు

1958 సంవత్సరంలో మలేషియా వ్యవసాయ మంత్రిత్వ శాఖ జాతీయ పుష్పంగా నామినేట్ చేసింది.జూలై 28 1960 న, మలేషియా ప్రభుత్వం మందార పువ్వు జాతీయ పువ్వుగా ప్రకటించింది.[4]

ఉపయోగాలు

  • మందార పువ్వులు,ఆకులు శిరోజాల సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు.
  • మందార పుష్పాలను పసిఫిక్ ద్వీపాలలో సలాడ్ లో వేసుకొని తింటారు.
  • భారతదేశంలో పువ్వులను దేవతల పూజలోను వాడతారు.
  • స్త్రీలకు పువ్వు ఒక ఆభరణము, అలంకారము, శుభసూచికము.
  • మందార పువ్వుల టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని కణజాలాన్ని రక్షిస్తాయి.
  • మందార పువ్వుల టీని రోజూ తాగడం వల్ల హైబీపీ తగ్గుతుంది. గుండె జబ్బులు వచ్చేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.[5]

చిత్ర మాలిక

మూలాలు

  1. "Hibiscus rosa-sinensis - Chinese Hibiscus, Shoeblackplant, Tropical Hibiscus, Red Hibiscus - Hawaiian Plants and Tropical Flowers". wildlifeofhawaii.com.
  2. "Home". internationalhibiscussociety.org (ఆంగ్లం లో). Retrieved 2020-01-19.
  3. "American Hibiscus Society". americanhibiscus.org. Retrieved 2020-01-19.
  4. Leong, Michelle. "Hibiscus: 11 Facts About Malaysia's National Flower". Culture Trip. Retrieved 2020-01-19.
  5. "మందార పూలు.. ఉపయోగాలు ఎన్నో..!" (ఆంగ్లం లో). Retrieved 2020-01-19. Cite web requires |website= (help)

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages