dcsimg

దువ్వెన బెండ ( Telugo )

fornecido por wikipedia emerging languages

దువ్వెన బెండను తుత్తురు బెండ, దువ్వెన కాయలు అని కూడా అంటారు. ఇది మాల్వేసి కుటుంబానికి చెందిన ఔషధ మొక్క. దీని వృక్ష శాస్త్రీయ నామం Abutilon indicum.

లక్షణాలు

దువ్వెనబెండ నిటారుగా నునుపుగా ఉన్న కాడలను కలిగి ఉండే పొద. ఈ పొద యొక్క ఆకులు అండాకారం లేదా హృదయాకారంలో ఉండి అంచులు చంద్రవంకల వంటి నొక్కులతో రంపం వలె గరుకుగా ఉంటాయి. ఈ మొక్క 1 నుండి 2 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఒక పద్ధతిలో ఏర్పడిన ఆకులు, పొడవైన కాడలు, నునుపుగా, మెత్తగా, సాదాగా శిరోజాల వలె ఉంటాయి. ఆరంజి పసుపు రంగు కలిసిన పుష్పాలు 2 నుంచి 3 సెంటీమీటర్ల అడ్డు కొలతతో 4 నుంచి 7 సెంటిమీటర్ల పొడవున్న కాడలను కలిగి ఉంటుంది. ఈ పొద యొక్క ఆకులు గుండిల వలె గుండ్రంగా ఉండి దువ్వెనకు ఉండే పళ్ల వలె ఉంటాయి. అందువలనే దీనిని దువ్వెన బెండ అంటారు. పిల్లలు ఈ కాయలతో తమాషాగా తల కూడా దువ్వుకుంటారు. ఈ మొక్క యొక్క ప్రతి భాగం వివిధ అవసరముల కొరకు ఉపయోగిస్తున్నారు.

దీనినే అతిబల మొక్క అంటారు==

మూలాలు

  1. "Abutilon indicum". Pacific Island Ecosystems at Risk. Retrieved 2008-06-18. Cite web requires |website= (help)

ఇవి కూడా చూడండి

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages