dcsimg

రెడ్డివారి నానబాలు ( Telugo )

fornecido por wikipedia emerging languages

 src=
పంచ్‌కల్ లోయలో యూఫోర్భియా హిర్టా

రెడ్డివారి నానబాలు వృక్ష శాస్త్రీయ నామం Euphorbia hirta. దీనిని పాలకాడ, నాగార్జుని, పచ్చబొట్లాకు, నానపాల అని కూడా అంటారు. సంస్కృతంలో దుగ్ధికా, హిందీలో దుగ్ధి అని అంటారు. ఆయుర్వేదం వంటి సాంప్రదాయక వైద్య విధానాల్లో ఈ మొక్కను ఆస్థమా వంటి శ్వాసకోశపు వ్యాధులకు, స్త్రీల ఆరోగ్య సమస్యలకు, ఉదరకోశపు వ్యాధులకు నివారణగా వాడతారు.[1]

వ్యాప్తి

మధ్య అమెరికా ఖండపు ప్రాంతానికి స్థానికమైన ఈ మొక్క ప్రపంచమంతటా ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాలలో కనిపిస్తుంది.[2] భారతదేశపు ఉష్ణ ప్రాంతమంతటా పచ్చిక బయళ్ళలో, బంజరు భూములలో పెరిగే మొక్క. ఇది ఆస్ట్రేలియాలో కూడా కనిపిస్తుంది. ఆఫ్రికాలోని ఉష్ణమండల, సమశీతోష్ణ ప్రాంతాలలో కూడా కనిపిస్తుంది

మొక్క వర్ణన

సన్నని కాండం గల వార్షికపు మొక్క. మొక్క అంతటా సన్న నూగు ఉంటుంది. ఆకులు కాండానికి ఇరువైపులా ఉంటాయి. మొక్క నుండి స్రవించే పాల లాంటి ద్రవంలో ఉన్న ఆల్కలాయిడ్లు, టర్పినాయిడ్లు మొదలైన పదార్ధాల వల్ల ఇది పశుగ్రాసంగా పనికిరాదు. సాధారణంగా ఇది కలుపు మొక్కగా పెరుగుతుంటుంది.[3]

మూలాలు

licença
cc-by-sa-3.0
direitos autorais
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు
original
visite a fonte
site do parceiro
wikipedia emerging languages