dcsimg
Image of Styela Fleming 1822
Creatures » » Animal » » Tunicates

Ascidian

Ascidiacea Blainville 1824

అసిడియేషియా ( Telugu )

provided by wikipedia emerging languages

అసిడియేషియా (Ascidiacea ; commonly known as the ascidians or sea squirts) యూరో కార్డేటా (Urochordata) తరగతికి చెందిన సముద్రంలో నివసించే జీవ జాతులు. ఇవి ఒక సంచి వలె కనిపించే అకశేరుకాలు. అసిడియన్లు ట్యూనిసిన్ అనే గట్టి పొరను కలిగివుంటాయి[2].

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇవి తక్కువ లోతున్న నీటిలో లవణాల శాతం 2.5 శాతం కన్నా ఎక్కువ కలిగిన పరిస్థితులలో నివసిస్తాయి. ఇవి స్థానబద్ధ జీవులుగా రాతి మీద అతుక్కొని ఉంటాయి.

వీనిలో సుమారు 2,300 జాతులు మూడు రకాలుగా గుర్తించబడ్డాయి

 src=
Ernst Haeckel's interpretation of several ascidians from Kunstformen der Natur, 1904

లక్షణాలు

  • ఇవి సరళ లేక సహనివేశక జీవులు
  • గ్రసని మీద అడ్డు వరుసలలో ఏర్పడిన శైలికామయ శ్వాసరంధ్రాలు లేక మొప్పచీలికలు ఆట్రియమ్ లోనికి తెరుచుకుంటాయి. ఆట్రియల్ రంధ్రము పృష్టతలములో ఉంటుంది.
  • ఢింబక దశలో పృష్టవంశము తోక భాగములో వుండి, ప్రౌఢ దశలో లోపించి వుంటుంది.
  • శరీరాన్ని కప్పుతూ రక్షణ కొరకు ట్యూనిసిన్ అనే పదార్ధముతో నిర్మితమైన కవచము లేక కంచుకము ఉంటుంది.
  • ప్రత్యుత్పత్తి మొగ్గతొడిగే విధానము వలన జరుగుతుంది. తిరోగామి రూపవిక్రియ ప్రదర్శిస్తాయి.

వర్గీకరణ

అసిడియేషియా విభాగము రెండు క్రమములుగా విభిజింపబడినది. అవి[3]

ఉదా: అసిడియా, సియోనా

  • క్రమము ప్లూరోగోనా :
  • ఇవి సామూహిక జీవులు
  • శరీరము విభజింపబడి ఉండదు.
  • న్యూరల్ గ్రంధి నాడీసంధికి పృష్టతలము ముందుగాని పార్శ్వముగా గాని ఏర్పడి ఉండును.
  • బీజకోశములు రెండు ఉన్నాయి.

ఉదా: హెర్డ్మేనియా, బోట్రిల్లన్

మూలాలు

  • తెలుగు అకాడమీ నుండి సేకరణ
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు

అసిడియేషియా: Brief Summary ( Telugu )

provided by wikipedia emerging languages

అసిడియేషియా (Ascidiacea ; commonly known as the ascidians or sea squirts) యూరో కార్డేటా (Urochordata) తరగతికి చెందిన సముద్రంలో నివసించే జీవ జాతులు. ఇవి ఒక సంచి వలె కనిపించే అకశేరుకాలు. అసిడియన్లు ట్యూనిసిన్ అనే గట్టి పొరను కలిగివుంటాయి.

ఇవి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. ఇవి తక్కువ లోతున్న నీటిలో లవణాల శాతం 2.5 శాతం కన్నా ఎక్కువ కలిగిన పరిస్థితులలో నివసిస్తాయి. ఇవి స్థానబద్ధ జీవులుగా రాతి మీద అతుక్కొని ఉంటాయి.

వీనిలో సుమారు 2,300 జాతులు మూడు రకాలుగా గుర్తించబడ్డాయి

 src= Ernst Haeckel's interpretation of several ascidians from Kunstformen der Natur, 1904
license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు