dcsimg

ఊసరవెల్లి ( Telugu )

provided by wikipedia emerging languages

ఊసరవెల్లి (ఆంగ్లం Chameleon) ఒక సరీసృపము. సాధారణంగా తొండ పెరిగేకొద్ది ఊసర వెల్లిగా మారుతుంది అంటారు .

అరుదైన లక్షణాలు

ఊసర వెల్లి యొక్క సహజ గుణం రంగులు మార్చడం, ఇది ఏదైన చెట్టుమీద కాని వస్తువు మీద కాని వెళ్ళి దాని రంగులొకి మారిపొయి రక్షణ పొందుతూ వేటాడుతుంది. ఇంకొక విశేషం ఏమిటంటే దీని నాలుక సహజంగా కన్నా పొడుగు ఉంటుంది, దీని ద్వారా దూరంనుంచే క్రిమి, కీటకాలను వేటాడుతుంది. దీనిని మాంసాహారంగా కుడా తీసుకుంటారు. ఇది అతి నెమ్మదిగా నడుస్తుంది. దీని పట్టు, ఇది దేనినైనా చాలా గట్టిగా పట్టుకుంటుంది, దీని పట్టు విడిపించడం కొంచం కష్టం ! 'ఉడుం పట్టు' అని బాగా ప్రసిద్ధి .

శరీర రంగు మార్పు

వూసరవెల్లి తన శరీరపు రంగును పరిసరాలకు అనుగుణంగా మారుస్తుందనుకోవడం నిజం కాదు. కానీ దాని శరీరపు రంగులు మారతాయనేది మాత్రం నిజం. పరిసరాల్లోని ఉష్ణోగ్రత, వెలుతురు తీవ్రతల్లోని హెచ్చుతగ్గులకు అనుగుణంగా దాని చర్మం స్పందిస్తూ ఉంటుంది. అవి ఒకదానితో ఒకటి సందేశాలు పంపుకోవడం, వాటి మానసికావస్థను తెలియ పరుచుకునే క్రమంలో కూడా ఈ రంగుల మార్పిడి ఉపయోగపడుతూ ఉంటుంది. వాటి చర్మంలో ఉండే జీవకణాల్లో పలు యాంత్రిక నిర్మాణాల చర్యల వల్ల రంగుల మార్పు జరుగుతుంది. చర్మంలోని క్రోమోటోఫోర్స్ (chromotophores) అనే ప్రత్యేకమైన జీవకణాల వల్ల వేర్వేరు రంగులు ఒకేచోట ఏర్పడడమో లేక వివిధ ప్రదేశాలకు విస్తరించడమో జరుగుతుంది. వివిధ రకాలైన క్రోమోటోఫోర్స్ వేర్వేరు రంగులను మెరిసే స్ఫటికాల రూపంలో కలిగి ఉంటాయి[1].

మూలాలు

ఇవి కూడా చూడండి

బల్లి

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు