dcsimg
Image of Strawberry anemones
Creatures » » Animal

Cnidarians

Cnidaria

నిడేరియా ( Telugu )

provided by wikipedia emerging languages

నిడేరియా (లాటిన్ Cnidaria) యూమెటాజోవాకు చెందిన ప్రతినిధులు. ఇవి ఎక్కువగా సముద్ర ఆవరణలో నివసిస్తాయి. ఇవి ఎక్కువగా స్థానబద్ధ జీవులు. ద్విస్తరిత శరీర నిర్మాణం, వలయ సౌష్టవం ప్రదర్శిస్తాయి.

సాధారణ లక్షణాలు

  • ఇవి కణజాల నిర్మాణస్థాయి గల మెటాజోవా జీవులు.
  • కొన్ని ఏకాంత, మరికొన్ని సహనివేశ జీవులు. శారీరానికి మధ్య పాయువు / నోరు ఉండి, చుట్టూ స్పర్శకాలు వలయంగా అమరి ఉంటాయి.
  • ఇవి ద్విస్తరిత నిర్మాణాన్ని ప్రదర్శిస్తాయి. వెలుపలి పొర - బహిత్వచం, లోపలి పొర - అంతఃత్వచం. వీటి మధ్యన నిర్మాణ రహితంగా, కణరహితంగా, జెల్లీవంటి శ్లేష్మస్తరం ఉంటుంది.
  • శరీరం వలయ సౌష్టవంగా ఉంటుంది. మధ్య అక్షం ద్వారా ఏ ఆయత తలంలో ఖండించిన రెండు సమభాగాలు ఉంటాయి - ఏకాక్ష విషమధ్రువ సౌష్టవం. సీ అనిమోన్ లో ద్విపర్శ్వ వలయ సౌష్టవం ఉంటుంది.
  • సీలెంటిరాన్ లేదా జఠర ప్రసరణ కుహరం అనే విశాలమైన మధ్య కుహరం ఉంటుంది. దీనిమూలంగా ప్రాథమిక నామం 'సీలెంటరేటా' వచ్చింది. తరువాత జీవులలో దంశకణాలు లేదా కుట్టుకణాలు ఉండటంతో వీటిని 'నిడేరియా' అని పేరు పెట్టారు. ఆహార పదార్ధాల జీర్ణం, జీర్ణమైన ఆహారం సరఫరా జఠరప్రసరణ కుహరంలో జరుగుతుంది.
  • సీలెంటరాన్ నోటితో వెలుపలికి వెరుచుకొంటుంది. ఇదే నోరు, పాయువు విధులను నిర్వహిస్తుంది.
  • సీలెంటరాన్ లో కణబాహ్య జీర్ణక్రియ, అంతఃస్త్వచ పోషక కండర కణాలలో కణాంతర జీర్ణక్రియ జరుగుతుంది.
  • శరీరకుడ్యంలో ఉన్న దంశకణాలు (కుట్టుకణాలు) రక్షణకు, సంసజనకానికి, ఆహారాన్ని పట్టుకోవడానికి (భక్షణ) ఉపయోగపడతాయి.
  • ప్రత్యేకంగా ప్రసరణ, శ్వాస, విసర్జక నిర్మాణాలు లేవు.
  • నాడీ కణాలు అధ్రువతంగా ఉండి, విస్తరిత నాడీవల కలిగి ఉంటాయి.
  • కోరకీభవనం ద్వారా (జెమ్నేషన్) అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకొంటాయి.
  • అభివృద్ధి అప్రత్యక్షంగా ఉంటుంది. ప్లాన్యులా అనే స్వేచ్ఛగా ఈదే శైలికామయ డింభక దశ ఉంటుంది.

వర్గీకరణ

మూలాలు

  1. Classes in Medusozoa based on The Taxonomicon - Taxon: Subphylum Medusozoa - Retrieved July 10, 2007
  2. Subphyla Anthozoa and Medusozoa based on The Taxonomicon - Taxon: Phylum Cnidaria - Retrieved July 10, 2007

license
cc-by-sa-3.0
copyright
వికీపీడియా రచయితలు మరియు సంపాదకులు